Thursday, May 2, 2024

ర‌వితేజ తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ-మేకింగ్ వీడియో రిలీజ్

హీరో ర‌వితేజ న‌టిస్తోన్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం నుండి మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. ఈ మేకంగ్ వీడియోలో రవితేజ.. ఎంతో కష్టపడ్డాడో చూపించారు. అలాగే… ఆయన చేసిన ఫీట్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాగా… టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతుంది ఈ చిత్రం. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతుంది.ఈ సినిమా జూలై 29 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement