Wednesday, March 29, 2023

రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య..

తెనాలి : రైలు కిందపడి ఇరువురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం స్థానిక తెనాఇ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన సుంకర అనుపమ మూడేళ్ల క్రితం వివాహం జరిగి మనస్పర్ధల కారణంగా భర్తకు దూరంగా అదే గ్రామంలో నివసిస్తుంది. అదే గ్రామానికి చెందిన సిద్ది శెట్టి సాయికిరణ్ కు వివాహం జరిగి భార్యా బాబుతో సంసారం సాగిస్తూ అనుపమతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. గత రెండు సంవత్సరాలుగా వీరి మధ్య జరుగుతున్న బాగోతాన్ని ఇరువైపుల తల్లిదండ్రులు తెలుసుకొని మందలించగా ఇరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement