Thursday, May 9, 2024

Mass Masala – రామ్ ‘స్కంధ’లో ఈ నరుకుడేంటీ బోయపాటి సామి.. వీడియోతో

YouTube video

అఖండ వంటి బంపర్ హిట్‌ తర్వాత బోయపాటి ఇస్మార్ట్ రామ్‌తో ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. రెండు నెలల్లో విడుదల కాబోతున్న సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను ప్రకటించారు. అలాగే మాస్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గ్లింప్స్‌లో రామ్‌.. దేవాలయంలోని నీటి గుండంలో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను నరుకుతూ ఊరమాస్‌ లెవల్లో కనిపించాడు.

అవుట్‌ అండ్‌ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక సెప్టెంబర్‌ 15న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ కానుంది. ప్ర‌స్తుతం ఈ మాస్ న‌రుకుడు గ్లింప్స్ వీల‌లెల్లో వైర‌ల్ అవుతున్న‌ది…

Advertisement

తాజా వార్తలు

Advertisement