Saturday, April 27, 2024

Banswada : రైతుల కష్టాల్లో అండగా ఉంటాం.. సభాపతి పోచారం

దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్న వెన్నెముక లాంటివారని, రైతులకు ఎటువంటి కష్టాలు ఎదురైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తాను రైతు కుటుంబంలోనే జన్మించి ఈ స్థాయిలో ఉన్నానని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో లేని భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సభాపతి కోట్లాది రూపాయల నిధుల మంజూరు కు కృషి చేశారన్నారు. మండలంలోని చింతకుంట సమీపంలో నిజాంసాగర్ కాలువ నీటిని ఆధారంగా చేసుకుని ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేశారు.

పంటల సాగులో ఖరీఫ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిజాంసాగర్ లో ఉన్న కొద్దిపాటి నీటిని పంటల సాగుకు విడుదల చేశామని, రైతులు వర్షాలు కురువకపోయినా వరి నాట్లను పెద్ద ఎత్తున సాగు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ఖరీఫ్ పంటకు మొదటగా నిజాం సాగర్ నీరు విడుదల చేశామని వివరించారు. ఈ ప్రాంత రైతులు ఎంతో చైతన్యవంతులని, ముందస్తు పంటలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించడంలో ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పిటిసి భాస్కర్ రెడ్డి, విండో అధ్యక్షులు శ్రీరామ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement