Monday, May 13, 2024

మేఘాలతోనే ఊరిస్తున్న వరుణుడు.. రైతన్న ఎదురుచూపులు

(ప్రభ న్యూస్‌): వానాకాలంలో రైతన్న వర్షాల కోసం ఎదిరిచూస్తున్నాడు. కొన్ని రోజులుగా మేఘాలు మురిపిస్తున్నప్ప టికీ చినుకు మాత్రం పడడంలేదు. దీంతో రైతుల్లో నిరా శ నెలకొంది. జూన్‌ మొదటి వారంలోనే వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతుంది. మే 25న రోహి ణి కార్తెతో వానాకాలం పంటల సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. రోహిణితో పాటు మృగశిర కార్తె దాదాపు పూర్తయినప్పటికీ వానలు కురువడంలేదు. ఈనెల 22న ప్రారంభంకానున్న ఆరుద్రకార్తెపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.

వేడి తగ్గని నేల..

ఎండ తీవ్రత మూలంగా నేటికీ నేలలో వేడి తీవ్రత తగ్గలేదు. గత వానా కాలం సీజన్‌లో వర్షాలు ముందుగా కురువడంతో ఇప్పటికే రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు విత్తారు. ప్రస్తు తం వర్షాలు ఆలస్యం అవుతుండడంతో కొంత మంది రైతులు ఇప్పటికి దుక్కులు దున్నకుండా ఉంచగా కొంతమంది దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదిరిచూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement