Monday, May 13, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. మబ్బులతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు బాగానే ఉన్నా.. సాయంత్రం 6గంటల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో అక్కడక్కడా ఒక మోస్తారు వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో అరగంట నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది.

నగరంలోని అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్, కాలిమందిర్, సన్ సిటీ, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాన పడుతోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, పటాన్‌చెరు, సేర్లింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట్, బేగంపేట్, సికింద్రాబాద్, మలకాజిగిరి, అల్వాల్, కప్రా ప్రాంతాల్లో రానున్న గంటపాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement