Sunday, April 28, 2024

మైక్రో ఎస్‌యూవీ కేట‌గిరీని శాసిస్తున్న టాటా పంచ్.. టాప్​ గేర్​లో దూసుకెళ్తున్న కారు వివ‌రాలు, విశేషాలివే

దేశంలోని దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ నుంచి 2021 అక్టోబ‌ర్ లో లాంచ్ అయిన కారు ‘టాటా పంచ్. ఈ కారు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా సేల్​ అవుతున్న టాప్-10 కార్లలో పంచ్ కూడా ఒకటి. అంతేకాకుండ‌ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో అమ్ముడ‌వుతున్న కార్ల‌లో కూడా టాప్ లో టాటా పంచ్ ఉంది . ఈ కారు రిలీజ్ అయి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే ఎక్కువ సేల్స్ జ‌రుపుకుని ఎస్‌యూవీ కార్ల‌లో ముందు వ‌రుసులో ఉంది. మ‌రి జనాలు టాటా పంచ్ కార్ ను అంతగా ఇష్టపడడానికి గ‌ల‌ కారణాలు ఏంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

1) డిజైన్:
చిన్న సైజులో ఉన్నా, టాటా పంచ్ డిజైన్‌ని ప్రజలు ఇష్టపడుతున్నారు. టాటా కంపెనీ పంచ్‌ను చిన్న పరిమాణంలో రిలీజ్ చేసినా.. సూపర్ డిజైన్‌ను అందించింది. ఈ కారు పొడవు 3827mm, వెడల్పు 1742mm, ఎత్తు 1615mm, వీల్ బేస్ 2445mm, గ్రౌండ్ క్లియరెన్స్ 187mm. ఇది 366 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

2) ఫీచ‌ర్స్:
టాటా పంచ్‌ చాలా ఫీచర్లును కలిగి ఉంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ AC, కూల్డ్ గ్లోవ్ బాక్స్, హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, iRA కనెక్ట్ చేయబడిన కారు టెక్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి.

3) సేఫ్టీ:
టాటా పంచ్‌ ALFA-ARC ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి వస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ చాలా సేఫ్టీని ఇస్తుంది. గ్లోబల్ NCAP పంచ్‌ ఆక్యుపెన్సీకి 5-స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. పిల్లల భద్రత కోసం 4-స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్​, ISOFIX చైల్డ్ మౌంట్‌లు వంటి ఫీచర్లను కలిగి ఉంది.

4) ఇంజిన్:
టాటా పంచ్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ తో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (86 PS పవర్, 113 Nm టార్క్)ను కలిగి ఉంటుంది. లీటరుకు 18.97 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తోంది. ఈ కారు CNG వెర్షన్ కూడా మున్ముందు లాంచ్ కానుంది. CNG మరింత మైలేజీని అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

5) ధ‌ర‌:
టాటా పంచ్ ధర చాలా మందిని ఆకర్షించేలా ఉంది. పంచ్ ప్రారంభ ధర రూ. 6 లక్షల నుంచి ఉంది. ఇక టాప్​ ఎండ్​ మోడల్​ అయితే ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.54 లక్షల వరకు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement