Monday, May 6, 2024

మ్యూజిక్​ డైరెక్టర్​గా రెహమాన్​ కూతురు.. అరంగేట్రానికి అంతా రెడీ!

భాషకి హ‌ద్దులు లేవని నిరూపించారు మ్యూజిక్​ డైరెక్టర్​ ఏఆర్​ రెహమాన్​. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, కంపోజ్​ చేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్​గా పేరుగాంచారు. ఇప్పుడు ఆయ‌న కూతురు ఖతీజా రెహమాన్ కూడా సంగీత దర్శకురాలిగా మారారు. సిల్లు కారుపత్తి ఫేమ్ హలిత షమీమ్ దర్శకత్వం వహిస్తున్న మిన్మిని మూవీతో ఆమె మ్యూజిక్​ కంపోజర్​గా అరంగేట్రం చేయడానికి రెడీగా ఉన్నారు.

ఈ విషయాన్ని డైరెక్టర్ హలిత సోషల్ మీడియా వేదిక‌గా వెల్లడించారు. రికార్డింగ్ స్టూడియోలో ఖతీజాతో కలిసి ఉన్న ఫొటోస్ ని అభిమానులతో షేర్​ చేసుకున్నారు. మిన్మినీ మూవీలో ఎస్తేర్ అనిల్, హరి కృష్ణన్, గౌరవ్ కలై, ప్రవీణ్ కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement