Saturday, April 27, 2024

మరోసారి భయపెడుతున్న లారెన్స్.. ‘దుర్గ’ ఫస్ట్ లుక్ రిలీజ్

హర్రర్ కామెడీ చిత్రాలకు రాఘవ లారెన్స్ పెట్టింది పేరు. గతంలో లారెన్స్ నుంచి వచ్చిన ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’, ‘కాంచన-2’ లాంటి సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఎంతో నవ్వించాయి. అందుకే ఆ సినిమాలు అంతగా విజయం సాధించాయి. హర్రర్ సినిమాలతో కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు వచ్చేలా చేయగలగడం లారెన్స్ ప్రత్యేకత.

తాజాగా లారెన్స్ ‘దుర్గ’ అనే సినిమా చేస్తున్నాడు. లారెన్స్ సొంత బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిట్, ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. అఘోర, క్షుద్ర మాంత్రిక పాత్రలకు దగ్గరగా ఉన్న లారెన్స్ లుక్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు లారెన్స్ ‘రుద్రన్’, ‘అధిగారం’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: ‘మా’లో కలకలం రేపుతున్న నటి హేమ వాయిస్

Advertisement

తాజా వార్తలు

Advertisement