Sunday, April 28, 2024

యువతను రెచ్చగొట్టొద్దు.. గతంలో మాదిరిగానే ఆర్మీలో నియామకాలు చేపట్టాలి: గంగుల కమలాకర్‌..

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ యువతను రెచ్చగొట్టొద్దని, సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా చింతకుంట గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన టీఆర్‌ఎస్‌ నాయకులు చేపించారని అంటున్న బండి సంజయ్‌ వాఖ్యలను ఖండిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా టీఆర్‌ఎస్‌ వాళ్లే చేపించారా అని ప్రశ్నించారు. సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలి తప్ప వివాదం చేయొద్దని, మూర్ఖపు మాటలు మాట్లాడొద్దని అన్నారు. నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగంలో ఉంటే దేశ సేవ ఎలా చేస్తారని.. గతంలో లాగే నియామకాలు చేపట్టాలని అన్నారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఇప్పటి వరకు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 9715 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని, అందులో 7464 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని అన్నారు. మిగిలిన ధాన్యం రైస్‌ మిల్లుల వద్ద ఆ్లనన్‌ పెండింగ్‌ పూర్తయ్యాక సోమవారం సాయంత్రంలోగా బకాయి ఉన్న 2251 కోట్ల రూపాయలు చెల్లింపు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి జరిగి దేశంలో ఏ అవార్డులు ప్రకటించినా తెలంగాణకే వస్తున్నాయన్నారు. గ్రామీణ క్రీడల వైపు పిల్లలు తిరిగి మల్లుతున్నారని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement