Monday, April 29, 2024

TS | ప్రధాని నరేంద్ర మోడీపై పొన్నం ప్రభాకర్ ఫైర్..

హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో విరాళాలు సేకరించవచ్చని మోడీ చెప్పారని అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోడీ నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వేల కోట్ల రూపాయల బాండ్లు తీసుకుందని విమర్శించారు. శరత్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి నుంచి బీజేపీ నేతలు రూ.5కోట్లు తీసుకొని లిక్కర్ కేసులో బెల్ ఇప్పించారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ మరొక వ్యక్తి నుంచి కూడా 100 కోట్ల రూపాయలను లంచంగా పుచ్చుకొని కాంట్రాక్ట్ వచ్చేలా చేసిందని అన్నారు.

దీనిబట్టి మోడీ ఏ విధంగా నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నారో తెలుసుకోవచ్చని పొన్నం చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీని నమ్మి ప్రజలు మోసపోకూడదని తెలిపారు. సంక్షేమ పరిపాలన కోసమై ప్రజలు ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలని మంత్రి పోన్నం కోరారు. ఇండియా కూటమి ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement