Sunday, April 28, 2024

AP | జ‌గ‌న్‌కు ఓడిపోతున్నాననే బయం పట్టుకుంది : పవన్‌ కల్యాణ్‌..

కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉమ్మడిగా ప్రచారంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ కు భయం చూపెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఓడిపోతున్నాననే విషయం జగన్‌కు అర్థమైందని ఎద్దేవా చేశారు. నేను భీమవరం నుంచి ఎందుకు మారారని జగన్ నన్ను అడుగుతున్నారు. మరి వైఎస్‌ జగన్‌ 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు వారి వారి స్థానాలను మార్చారు..? అని నిలదీశారు. నోరుంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

కూటమి అభ్యర్థులను గెలిపించాలి.. దశాబ్దం కాలంపాటు ఏం ఆశించకుండా పని చేశాం.. ఈ సారి గెలుపు ఖాయం.. కానీ భారీ మెజార్టీ కావాలన్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే, మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తామ‌ని.. సీపీఎస్ రద్దు అంశంపై ఏడాదిలోగా పరిష్కారం చూపుతాం అన్నారు. టీచర్లను గౌరవిస్తాం అని వెల్లడించారు. ఇక, వైసీపీ ప్ర‌భుత్వ హయాంలో మత్స్యకారుల పొట్ట కొట్టారు. RTC, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ అక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే జరిగాయి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలీసుల శ్రమను కూడా దోచుకున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి.ఏ వర్గమూ సంతోషంగా లేదు’ అని ఆయనతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement