Monday, April 29, 2024

Kriti Sanon : జీన్స్ లోనూ కెవ్వు కేక‌….

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. బీటౌన్ లో టాప్ హీరోయిన్ గా తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది కృతి. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.

గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా.. లేడీ ఓరియంటెడ్, ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. గత ఏడాది తెలుగులో ఆదిపురుష్ మూవీతో పలకరించింది. ఈ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల క్రూ మూవీతో సక్సెస్ అందుకుంది. తాజాగా ఎల్లే మ్యాగ్ జైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. డెనిమ్ జీన్ జాకెట్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. హెయిర్ లీవ్ చేసి తన చూపుతో అందరినీ ఫిదా చేస్తోంది. తన నాభి అందాలతో నెటిజన్ల చూపు తనవైపు తిప్పుకుంటోంది. మ్యాగ్ జైన్ కవర్ పేజీని ఎల్లే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. క్రూలో కృతితో స్క్రీన్ షేర్ చేసుకున్న కరీనా కపూర్ వ్యాఖ్యలను సుదీర్ఘమైన పోస్ట్ రూపంలో పెట్టింది. కృతి స్టన్నింగ్ లుక్ కు ఫిదా అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జీన్స్ లో కృతి కటౌట్ అదిరిపోయిందని చెబుతున్నారు. పోజ్ సింప్లీ సూపర్బ్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎల్లే ఇన్ స్టా పోస్ట్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement