Tuesday, April 30, 2024

GT vs DC | టాస్ గెలిచిన ఢిల్లీ..

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (బుధవారం) గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుని.. గుజ‌రాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.

జట్ల వివరాలు :

ఢిల్లీ క్యాపిటల్స్ :

పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

గుజరాత్ టైటాన్స్ :

వృద్ధిమాన్ సాహా (wk), శుభమాన్ గిల్ (c ), బి సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్.

- Advertisement -

అయితే, వరుస ఓటములతో సతమతమవుతున్న డిల్లీ క్యాపిటల్స్‌కు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ… ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement