Monday, May 13, 2024

పీజీ వైద్యవిద్య రెండో విడత కౌన్సెలింగ్‌.. ఈనెల 7న వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: పీజీ వైద్యవిద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ ఆదివారం రెండవ విడత ప్రవేశాలకు ప్రకటన విడుదలచేసింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలో ఉన్న యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వాాం భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

సీట్ల ఖాళీల వివరాలను యూనవర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 7న సోమవారం ఉదయం 7 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement