Tuesday, April 30, 2024

పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం..

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి : పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

ఈనెల 10న ఉదయం పది గంటల నుంచి 17న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్‌ జాబితా విడుదల అనంతరం వెబ్‌ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రది ంచాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement