Monday, April 29, 2024

పీజీ వైద్యులు ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయాల్సిందే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యనభ్యసించిన విద్యార్థులు కొద్దికాలంపాటు ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పేద, సామాన్య రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2022 నాటికి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ సర్వీసుల్లో అప్రింటీషిప్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఎంఈ డా. రమేష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన సర్క్యులర్‌ జారీ చేశారు. మంగళ, బుధవారాల్లో కౌన్సిలింగ్‌ ఉంటుందన్నారు. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ జారీ చేసిన మార్కుల జాబితాను తీసుకుని కౌన్సిలింగ్‌కు రావాలని విద్యార్థులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement