Sunday, April 28, 2024

అంతర్జాతీయ వ్యాపారంలో రూపాయల్లో చెల్లింపులు.. బ్యాంక్‌లు తగిన ఏర్పాట్లు చేయాలన్న ఆర్బీఐ

అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతులు, దిగుమతుల కోసం రూపాయల్లో చెల్లించేందుకు బ్యాంక్‌లు తగిన ఏర్పాట్లు చేయాలని సోమవారం నాడు ఆర్బీఐ కోరింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ వ్యాపారులు ఇండియన్‌ రూపాయల్లో చెల్లింపుల పట్ల ఆసక్తి చూపిస్తున్నందున ఈ మేరకు బ్యాంక్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.

గ్లోబల్‌ ట్రేడ్‌లో ఇన్‌వాయిస్‌ చెల్లింపులు, ఎగుమతులు, దిగుమతుల సెటిల్‌మెంట్స్‌ను రూపాయల్లో చెల్లించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌లోని ఫారిన్‌ ఎక్స్ఛెంజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి బ్యాంక్‌లు అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరింది. కొత్త విధానంలో అంతర్జాతీయ వాణిజ్యంలో మారకపు రేటును ఇక నుంచి రూపాయల్లో చెల్లిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement