Saturday, April 27, 2024

ఇంగ్లండ్‌- టీమిండియా మ‌ద్య‌ రేపే తొలి వన్డే మ్యాచ్‌.. కోహ్లీ ఆడ‌టం క‌ష్ట‌మే!

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఇప్పటికే టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అదే ఊపుతో టీమిండియా వన్డేసిరీస్‌ పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ది ఒవల్‌ మైదానం వేదికగా మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 సిరీస్‌ ఓడిన ఇంగ్లండ్‌ జట్టు వన్డే సిరీస్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియా జట్టులోకి శిఖర్‌ ధావన్‌ వచ్చేశాడు. బౌలింగ్‌లోనూ మార్పులకు అవకాశముందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. వన్డే జట్టులోని ఆటగాళ్లు మారడంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓపెనర్‌గా సీనియర్‌ ప్లేయర్‌ శిఖర్‌ ధావన్‌ బరిలోకి దిగడం ఖాయం.. దీంతో ఇషాన్‌ కిషన్‌ బెంచ్‌కే పరిమితమవుతాడా? వన్‌డౌన్‌లో అవకాశం కల్పిస్తారని తెలియాల్సి ఉంది. కెప్టెన్‌ రోహిత్‌శర్మతో కలిసి శిఖర్‌ ధావన్‌ ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఓపెనర్లుగా రోహిత్‌- ధావన్‌ జోడీకి మంచి రికార్డు ఉంది. ఇక విరాట్‌ కోహ్లీకి ఈ సిరీస్‌ అగ్ని పరీక్షగా మారనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సైతం విరాట్‌కు వన్డే సిరీసే చివరి అవకాశంగా భావిస్తోంది. మరోవైపు కోహ్లీ స్థానంలో యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడాలకు చాన్స్‌ ఇచ్చే అవకాశముంది.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే… ముగ్గురు స్పెషలిస్ట్‌ పేసర్లు, ఓ స్పిన్నర్‌తో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిధ్‌ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌ ఉండగా, తుది జట్టులో ఎవరెవరికి చాన్స్‌ ఇస్తారా? అనేది చూడాలి. షమీకి రెస్ట్‌ ఇచ్చి యువ పేసర్లను ఆడించే అవకాశం కూడా ఉంది. ఏకైక స్పిన్నర్‌గా చాహల్‌ స్థానానికి డోకా లేదని తెలుస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement