Thursday, May 9, 2024

పెట్రోలియం కంపెనీల నష్టాలు 10,700 కోట్లు..

ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ (ఐవోసీ) భారత్‌ పెట్రోలియం కార్పోరేషనల్‌ (బీపీసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌( హెచ్‌పీసీఎల్‌) ఈ ఆర్ధిక సంవత్సరంలో 10,700 కోట్లు నష్టపోవచ్చని సోమవారం నాడు వెలువడిన ఒక నివేదిక తెలిపింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా వీటి రేట్లను సవరించకపోవడం వల్ల నష్టాలకే ఈ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మాల్సి వచ్చిందని ఈ నివేదిక వెలువరించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో 90 శాతం వరకు మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.

వీటికి సొంత ఆయిల్‌ రిఫైనరీలు ఉన్నాయి. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా దేశీయంగా వీటి రేట్లను సవరించకపోవడం వల్ల ప్రతి లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై 12-14 రూపాయల నష్టపోతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. రిఫైనరీ స్థాయిలో మార్జిన్లు సరిగానే ఉన్నప్పటికీ, రిటైల్‌ అమ్మకాల్లో మాత్రం నష్టాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నష్టాలు 2022-23 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 10,700 కోట్ల వరకు ఉంటాయని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ముడి చమురు ధరలు తగ్గుతున్నందున ఈ నష్టాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement