Friday, May 3, 2024

అనైతిక విధానాలకు పాల్పడ్డ ఉబర్‌.. సమాచారం ల‌భించకుండా డిలీట్‌ బటన్‌

రైడ్‌ షేరింగ్‌ సర్వీసుల అందిచే ఉబర్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు అనేక అక్రమార్గాలను అనుసరించింది. అనైతిక, అక్రమ చర్యలకు పాల్పడింది. పన్ను సోదాలు, అధికారులు తగిన సమాచారాన్ని సేకరించకుండా ఉండేందుకు వర్చువల్‌ ప్రెయివేట్‌ నెట్‌వర్క్‌ పీచర్‌ కిల్‌ స్విచ్‌ ను వాడినట్లు బయటపడింది. ఈ కిల్‌ స్విచ్‌ను ఉపయోగిస్తే తనిఖీలు చేసే సమయంలో, ఇతర నియంత్రణ చర్యలు , అత్యవసర సమయాల్లో అధికారులు సంబంధిత సమాచారం సేకరించాల్సి వచ్చిన సమయాల్లో కంప్యూటర్లు వాటంతట అవే షట్‌ డౌన్‌ అవుతాయి. ఫ లితంగా అధికారులు, దర్యాప్తు ఏజెన్సీలు ఎలాంటి సమయారాన్ని సేకరించలేవు. దీని కోసం ఉబర్‌ మొదటి కాస్పర్‌, రిప్లే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు ఉబర్‌ ఫైల్స్‌ పేరుతో బయటడిన సమాచారం వెల్లడిస్తోంది. 2014-17 మధ్య కాలంలో ఉబర్‌కు చెందిన 1,24,000 డాక్యుమెంట్లను బ్రిటన్‌కు చెందిన దిన పత్రిక ది గార్డెయన్‌ సేకరించింది. ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్స్‌ (ఐసిఐజే)తో పంచుకోవడంతో వివరాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం ప్రకారం 2014-16 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉబర్‌ కిల్‌ స్విచ్‌ను ఉపయోగించింది. 2015లో అమ్‌స్టర్డామ్‌లో ఉపయోగించినప్పుడు స్వయంగా ఉబర్‌ సహ వ్యవ స్థాపకుడు ట్రావీస్‌ కలని క్‌ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడైంది.

మన దేశంలో 2015లో వినియోగం..
మన దేశంలో 2015 ఫిబ్రవి 10న ఉబర్‌ కిల్‌ స్విచ్‌ను వాడినట్లు తేలింది. 2014 చివరలో న్యూఢిల్లిdలో ఉబర్‌ క్యాబ్‌లో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. దీంతో ఢిల్లిలో ఉబర్‌ క్యాబ్‌ సర్వీసులపై రెండు నెలల పాటు నిషేధం విధించారు. దీని తరువాత ఉబర్‌ కిల్‌ స్విచ్‌ను ఉపయోగించింది. ఈ సంఘటనపై అధికారులు సమాచారం కావాలని కోరినప్పుడు కంప్యూటర్లను షెట్‌ డౌన్‌ చేయాలని ఉబర్‌ యాజమాన్యం సూచించింది. దీని వల్ల అధికారులు ఎలాంటి సమాచారాన్ని సేకరించలేరని ఢిల్లిdలోని ఉబర్‌ అధికారులకు ఈ మెయిల్‌లో సమాచారం ఇచ్చారు.ఐరోపా మార్కెట్‌ను హస్తగతం చేసుకునేందుకు ఉబర్‌ అక్రమ మార్గంలో విస్తరించేందుకు ఏటా 90 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే అనేక మంది ఉన్నతాధిఆరులను, రాజకీయ నాయకులను ఉపయోగించుకుంది. ప్రస్తుత ప్రాన్స్‌ అధ్యక్షుడుగా ఉన్న ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ఉబర్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడైంది.వీటన్నింటికి అప్పటి ఉబర్‌ బాస్‌గా ఉన్న టర్‌విస్‌ కలనిక్‌ నిర్ణయాలే కారణమని ఆయన్ని 2017లో తొలగించారు. ప్రస్తుతం ఉబర్‌ను దారా భోస్రోసాహికి సారధ్యం వహిస్తున్నారు. సంస్థ ప్రక్షాళన భాద్యతను ఆయనకు అప్పగించారు. తన అధికార పరిధిని దాటి ఉబర్‌కు సహకరించిన వారిలో ఐరోపా సమాఖ్య డిజిటల్‌ కమిషనర్‌గా పని చేసిన నీలీ క్రోస్‌ కూడా ఉన్నారు. ఆమె తన సొంత దేశమైన నెదర్లాండ్స్‌లో ఉబర్‌ కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు వీలుగా అనేక నిబంధనలను సడించడానికి తోడ్పడ్డారు. ఇందుకు ప్రతిఫలంగా పదవి కాలం ముగిసిన తరువాత ఉబర్‌లో సలహాదారుగా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈయూ నిబంధనలకు విరుద్దమైనప్పటికీ ఆమె అలా ఉబర్‌తో ఒప్పందం చేసుకున్నారు.

మన్నించాలని కోరిన ఉబర్..
బయటకు వచ్చిన సమాచారం నిజమేనని ఉబర్‌ అంగీకరించింది. అప్పుడు జరిగిన దానికి క్షమించాలని కోరింది. ప్రస్తుతం ఉబర్‌ అందిస్తున్న సేవలను గుర్తించాలని అప్పటి ఉబర్‌కు ప్రస్తుతం ఉబర్‌కు పూర్తి భిన్నంగా ఉందని తెలిపింది. ప్రస్తుత యాజమాన్యం జరిగిన తప్పులను సరి చేసిందని, అన్ని నిబంధనలకు అనుగుణంగానే సర్వీసులు నడిచేలా చూస్తున్నారని దాన్ని గమనంలో ఉంచుకోవాలని వేడుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement