Sunday, May 19, 2024

ప‌వ‌న్ కల్యాణ్ ప్లాన్..జ‌న‌సేన స‌త్తా చాటేనా..

సినిమాల్లో న‌టిస్తూనే రాజ‌కీయాల్లో కూడా త‌న‌దైనశైలిలో దూసుకుపోతున్నాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ అయిన ఆయ‌న రాజ‌కీయాల్లో త‌న‌దైనముద్ర వేయాల‌ని భావిస్తున్నారు. అభిమానుల పరంగా, సామాజికపరంగా చూస్తే పవన్ కల్యాణ‌ కు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంచి పట్టుంది. ఇక్కడ జ‌న‌సేన‌కి ఓటు బ్యాంకు కూడా అధికంగానే ఉంది. మొన్న జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతాల్లోనే జనసేన కొన్ని సీట్లు గెలుచుకోగలిగ‌ల‌గ‌డంతో ఆ ప్రాంతంపై ప‌ట్టు సాధించేందుకు వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు.

కాగా రాయ‌ల‌ సీమ, కోస్తాంధ్రల్లో జనసేన బలహీనంగానే ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. అయితే తమకు పట్టున్న ప్రాంతాల్లో గెలవగలిగిన నియోజకవర్గాలు, అక్కడ అభ్యర్థుల ఎంపికను కూడా ప్రతిష్టాత్మకమే. కనీసం నలభై నుంచి యాభై స్థానాల్లో ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక సంస్థతో సర్వే చేయాలని పవన్ కల్యాణ‌ నిర్ణయించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈ సర్వే చేస్తే సరైన ఫలితం వస్తుందని భావిస్తున్నారు. జనసేన ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలంటే కనీసం నలభై నుంచి యాభై స్థానాల్లో గెలవాలన్నది పవన్ కల్యాణ్ లక్ష్యంగా కన్పిస్తుంది. ఈ స్థానాలు కూడా అన్నీ వైసీపీ సిట్టింగ్ స్థానాలే అయి ఉంటాయని టాక్ .

ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లోనే గెలిచింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్దగా టీడీపీకి దక్కలేదు. దీంతో వైసీపీ సిట్టింగ్ స్థానాలనే పవన్ కల్యాణ‌ టార్గెట్ గా పెట్టుకున్నార‌నిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప‌లు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ బాధ్యతను కూడా సర్వే సంస్థకు అప్పగించాలని డిసైడ్ అయ్యారట‌. యాభై స్థానాల్లో గెలిస్తే .. రాష్ట్రంలో హాంగ్ వస్తుంద‌ని ..అప్పటి పరిస్థితిని బట్టి ముఖ్య పీఠం పై గురి పెట్టాలనేది పవన్ యోచిస్తున్నార‌ట‌. అసెంబ్లీకి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తింపుని తెచ్చుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. మ‌రి ప‌వ‌న్ ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement