Sunday, May 5, 2024

AP: బీజేపీ తీరుపై లెఫ్ట్ పార్టీల సీరియ‌స్‌.. ‘పెట్రో’ ధ‌ర‌లు త‌గ్గించాలని ధ‌ర్నా..

పొన్నూరు రూరల్ (ప్రభా న్యూస్): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐటియుసి పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్ ఐ టి రామారావు అన్నారు. ఈరోజు అంబేద్కర్ సెంటర్ నందు సిపిఐ ఏ ఐ టి యు సి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి రామారావు మాట్లాడారు.

ఆటో యూనియన్ కార్యదర్శి కూచిపూడి రత్నబాబు అధ్యక్షత వహించగా ఆర్ ఐ టి రామారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి కి లీటర్ పెట్రోల్ ధర అరవై ఐదు రూపాయలు డీజిల్ 55 రూపాయలు గా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పెట్రోల్ డీజిల్ ధరలు వంద పైచిలుకు చేరిందని దీని వలన వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి అన్నారు. పెట్రోల్ డిజైన్ జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందన్నారు. డీజిల్ రేట్లు పెరగడం వలన ఆటో కార్మికుల జీవన పరిస్థితులు దిగ‌జారిపోయాయ‌న్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వానికి ప్ర‌జ‌లు సరైన బుద్ధి చెబుతార‌ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement