Wednesday, May 8, 2024

ట్విట్ట‌ర్ డీపీ మార్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ – ఫొటోని వైర‌ల్ చేస్తోన్న ఫ్యాన్స్

సెల‌బ్రిటీలు ఏం చేసినా వైర‌ల్ గా మారుతుంటుంది. అందులోనూ ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ డీపీ మార్చారంటే ఎంతో స్పెష‌ల్ అనే చెప్పాలి. కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. మిగిలిన పార్టీల మాదిరి తనకు మీడియా బలం లేకపోవడంతో సోషల్ మీడియానే విరివిగా వినియోగించుకుంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ డీపీ మార్చారు. దీంతో ఒక్కసారిగా అది నేషనల్ వైడ్ ట్రెండింగ్ గా మారింది. సాధారణంగా హీరోలు హీరోయిన్లు తరచూ తమ ప్రొఫైల్ డీపీలు మారుస్తుంటారు. అయితే పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ డీపీ మార్చక దాదాపు నాలుగేళ్లు అవుతోంది.

అప్పటి నుంచి పూర్తి గడ్డంతో ఉన్న డీపీ ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా ఉండేది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పవన్ తన డీపీని మార్చడం చర్చనీయాంశమైంది. వైట్ అండ్ వైట్ లో లైటుగా నెరిసిన గడ్డం మీసం జుట్టుతో తీక్షణ చూపులతో కూడిన పవన్ కల్యాణ్ డీపీ నెటిజన్లను ఓ రేంజులో కట్టిపడేస్తోంది. ఇక పవన్ అభిమానుల సందడి అయితే చెప్పాల్సిన పని లేదు. లైకులు షేర్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అలాగే పవన్ పెట్టుకున్న డీపీని తమ సోషల్ మీడియా ఖాతాలకు పెట్టుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నారు. తమిళ చిత్రం ‘వినోదయ చిత్తం’ ను చేయనున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement