Monday, May 6, 2024

ఐపీఎల్‌ మహిళా వరల్డ్‌ క్రికెట్‌లో పాల్గొంటా..

త్వరలో జరుగనున్న వరల్డ్‌ ఐపీఎల్‌ మహిళా క్రికెట్‌ పోటీ ప్రారంభోత్సవ మ్యాచ్‌కు హాజరుకానున్నట్లు లెజెండరీ క్రికెట్‌ ప్లేయర్‌, భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలిరాజ్‌ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఇంకా కొన్ని నెలలు ఉన్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేనని కూడా తెలిపింది. ఐసీసీ వందశాతం అవకాశం ఇస్తుందని నమ్మకాన్ని వెలిబుచ్చింది. పదవీ విరమణ తర్వాత ప్రారంభోత్సవ మ్యాచ్‌కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌ వరల్డ్‌ కప్‌లో మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొంటున్నాయి. మిథాలి పదవీవిరమణ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి మహిళా ఐపీఎల్‌ కావడంతో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మిథాలి రాజ్‌ 23 సంవత్సరాలు ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మిథాలి ఓపెనర్‌ సఫాలి వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. నేటి యువతకు మిథాలి క్రీడాస్ఫూర్తిని రగిలించిందని చెప్పవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement