Sunday, May 19, 2024

PAK vs BAN | దంచ్చికొట్టిన పాక్ ఓపెనర్లు.. బంగ్లాపై ఘన విజయం

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌పలో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మౌతున్న‌ పాకిస్తాన్ ఇవ్వాల (మంగ‌ళ‌వారం) జ‌రిగిన మ్యాచ్ లో ఊపిరి పీల్చుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పాకిస్తాన్ – బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా.. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

205 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్.. 33 ఓవ‌ర్ల‌లోపే ఆట‌ను ముగించేసింది. పాకిస్తాన్ ఓపెన‌ర్లు అబ్దుల్లా షఫీక్ (68), ఫఖర్ జమాన్ (81) అర్థ సెంచ‌రీల‌తో రెచ్చిపోయారు. దీంతో పాకిస్తాన్ స్కోర్ భారీగా వెల్లింది. ఇక మహ్మద్ రిజ్వాన్ 26, ఇఫ్తికార్ అహ్మద్ 17 పరుగులతో ఆకట్టుకున్నారు.

దాదాపు ప్లేఆఫ్స్ ఆశ‌లు కోల్ప‌యిన బంగ్లాదేశ్ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేయ‌గా.. 45.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా (56) పరుగులు, లిటన్ దాస్ (45) పరుగులు, షకీబ్ అల్ హసన్ (43) పరుగులు, మెహిదీ హసన్ మిరాజ్ 25 పరుగులు చేశారు. మిగిలిన వారు ఐదు, ప‌ది ప‌రుగుల లోపే పెవిలియ‌న్ చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement