Sunday, April 28, 2024

ఫ్రాన్స్‌లో కరోనా కలకలం.. రోజుకు లక్షకు పైగా కేసులు..

ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే లక్ష పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌ కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. గడిచిన 24 గంటల్లో 1,04,611 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 90,88,371 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,22,546 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకు 77,94,802 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 42,085 మంది కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ వ్యాప్తంగా 11,71,023 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 3,254 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఫ్రాన్స్‌లో నమోదైన లక్షకు పైగా కరోనా కేసుల్లో.. ఒమిక్రాన్‌ బాధితులే ఎక్కువగా ఉన్నారని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement