Tuesday, March 26, 2024

Good News: వాట్సాప్ ఇంటర్ ఫేస్ రీ డిజైన్, బిజినెస్ కాంటాక్ట్ ఇన్ ఫో పేజీ అందుబాటులోకి..

కాంటాక్ట్ ఇన్ ఫో పేజీని రీ డిజైన్ చేస్తున్నట్టు ప్రకటించింది WhatsApp మెసేజింగ్ సంస్థ. దీనికి ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌ను పొందుపరుస్తున్నమిన తెలిపింది. యూజర్లు తమ యాప్‌లోని బిజినెస్ డైరెక్టరీని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమీపంలోని బిజినెస్ అంశాలను ఫిల్టర్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. అయితే.. ఇప్పుడే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులోకి రావడం లేదు. కాగా, WhatsApp డెవలపింగ్ ఎబిలిటీ కలిగిన యూజర్లకు సంబంధించిన iOSలోని కమ్యూనిటీకి లింక్ చేసే సామర్థ్యాన్ని మరింత డెవలప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది గతంలో ఆండ్రాయిడ్ యూజర్లు వాడే వాట్సాప్‌లో కూడా కనిపించింది.

WhatsApp బీటా ట్రాకర్, WABetaInfo సమాచారం ప్రకారం.. WhatsApp Android, iOS యూజర్ల కోసం రీ డిజైన్డ్ కాంటాక్ట్ ఇన్ ఫో పేజీని డెవలప్ చేస్తోంది కంపెనీ. కాగా, ఇది గత ఆగస్ట్ లో బీటా వెర్షన్‌లో అప్‌డేట్ అయిన బిజినెస్ ఇన్ఫో పేజీలో కనిపించిన మాదిరిగానే ఉండడం గమనార్హం. రీ డిజైన్ చేసిన కాంటాక్ట్ ఇన్ ఫో పేజీని ముందు ఐఓఎస్ ఆధారిత యాపిల్ ఫోన్లలో అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ లో కూడా ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. రీ డిజైన్ చేసిన కాంటాక్ట్ ఇన్ ఫో పేజీ ద్వారా బిజినెస్ అంశాలకు సంబంధించిన గ్రోసరీస్, రెస్టారెంట్స్, క్లాతింగ్ వంటి షాపింగ్ అంశాలను ఈజీగా గుర్తించవచ్చని వాట్సాప్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement