Thursday, May 23, 2024

జీ- సోనీ విలీనానికి ఓకే..

సోనీ పిచ్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జెడ్‌ఈఈ ఎల్‌)ల విలీనానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్చేంజీలకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెల్లడించింది. విలీన సంస్థలో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ) మెజారిటీ వాటా 50.86 శాతాన్ని కలిగివుండనుంది. జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రమోటర్లు 3.99 శాతం వాటా, ఇతర జీ షేర్‌ హోల్డర్లు 45.1 శాతం వాటాను కంపెనీలో కలిగివుండనున్నారు. ఒప్పందం ప్రకారం.. రెండు సంస్థల టెలివిజన్‌ చానెల్స్‌, ఫిల్మ్‌ అసెట్స్‌, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ విలీనమవనున్నాయి. విలీన సంస్థలో జనాల్లో ఆదరణ కలిగిన సోనీ మ్యాక్స్‌, జీ టీవీతోపాటు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ జీ5, సోనీలైవ్‌ ఉండనున్నాయి. ఇక విలీన సంస్థ ఎండీ, సీఈవోగా పునీత్‌ గొయెంకా కొనసాగనున్నారు.

బోర్డులో మెజారిటీ సభ్యులను సోనీ గ్రూప్‌ నామినేట్‌ చేయనుంది. ఎస్‌పీఎన్‌ఐ ప్రస్తు త మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో ఎన్‌పీ సింగ్‌తో పాటు పలువురును నామినేట్‌ చేయనుంది. తదుపరి తరం ఎంటర్‌టైన్‌లో అపార అవకాశాలను అందిపుచ్చుకు నేందుకు రెండు ప్రధాన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు చేతులు కలిపాయని జీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఎండీ, సీఈవో పునీత్‌ గొయెంకా వెల్లడించారు. విలీన కంపెనీ సమగ్ర వినోద వ్యాపారాన్ని చేయనుంది. విస్తృత కంటెంట్‌తో తమ ప్లాట్‌ ఫామ్స్‌ పై వినియోగ దారులను అలరి స్తామని ఆయన చెప్పారు. జీ, ఎస్‌పీఎన్‌ఐ పరస్పర చర్చల సమయంలో ఇరు కంపెనీల మధ్య విస్తృత స్థాయి చర్చల ఫలింగా ఒప్పందం కుదిరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ లో కంపెనీ పేర్కొంది. రెండు కంపెనీల కలయిక తర్వాత ఉమ్మడి కంపెనీ భారత్‌లో పబ్లిక్‌ కంపెనీగా లిస్టింగ్‌ అవుతుందని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement