Monday, May 6, 2024

క్షిపణులను ప్రయోగించాం: ఉత్తర కొరియా

అమెరికాకు కొరకరాని కొయ్య ఉత్తర కొరియా ఎవ్వరి మాటా వినేటట్లు లేదు. తాజాగా మిసైల్స్ ప్రయోగం గురించి అధికారికంగా ఆ దేశం ప్రకటించింది. అంతే కాదు మిసైళ్లను ప్రయోగించిన ఫొటోలను విడుదల కూడా చేసింది. రెండు క్షిపణులను ప్రయోగించామని, అవి కొత్త రకం గైడెడ్ మిసైల్స్ అని ఆ దేశ అధికారిక అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ప్రకటించింది. ప్రయోగించిన మిసైళ్లు దేశ తూర్పు తీరంలోని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఆ రెండు క్షిపణులు విజయవంతంగా ఛేదించాయని పేర్కొంది.  అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు.. ప్రయోగంపై విమర్శలు కురిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement