Thursday, May 2, 2024

ఒకేరోజు ఓటీటీలో నాని టక్ జగదీష్, నితిన్ మాస్ట్రో

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కావడం ఖాయమని తేలిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదే రోజున నితిన్ ‘మాస్ట్రో’ కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. ఈ మూవీలో తమన్నా నెగిటివ్ పాత్ర పోషిస్తుండగా.. మరో హీరోయిన్ నభా నటేష్ మెయిన్ హీరోయిన్‌గా కనిపించనుంది.

నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో ఓటీటీ రిలీజ్ హక్కులను రూ.32 కోట్లకు అమ్మినట్లు సమాచారం. మాస్ట్రో బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ తన కెరీర్‌లో తొలిసారి కళ్ళు లేని పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా టైటిల్ ఫిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement