Sunday, April 28, 2024

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా టైటిల్ ఫిక్స్

ఉప్పెన సినిమాలో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఎప్పటి నుంచో షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటి వరకు టైటిల్ ని అనౌన్స్ చేయలేదు. కాగా తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ ను అనౌన్స్ చేసింది.

ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ క్రిష్ సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా… అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement