Sunday, May 12, 2024

బ్యాంకర్లతో నిర్మాలా భేటీ.. సోమవారం జరిగే మీటింగ్​ కోసం కీలక అంశాలపై చర్చ

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ సోమవారం నాడు సమావేశం కానున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల అమలు తీరును ఆమె ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ క్షిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నందున ఉత్పాదక రంగానికి మరిన్ని రుణాలు ఇవ్వాలని కేంద్రం గతంలో బ్యాంక్‌లను ఆదేశించింది. రుణాల తీరుపై ఆమె సమావేశంలో సమీక్ష చేస్తారు. గత వారం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఐకానిక్‌ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్‌లు పలు లబ్దిదారులకు రుణాలు పంపిణీ చేశాయి. బ్యాంక్‌ల ఆస్తుల నిర్వాహణ, ఆప్పులు, రుణాలు పంపిణీ, పనితీరు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. బ్యాంక్‌ల నిరర్ధక ఆస్తుల విషయం, రుణాల రికవరీ అంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎన్‌పీఏల విషయంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కిసాన్‌ క్రిడెట్‌ కార్డుల జారీ. ఎమర్జన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ అమలు తీరును సమీక్షిస్తారు. ఈ స్కీమ్‌ను 2023 మార్చి వరకు పొడిగించారు. దీని కింద పెద్ద సంస్థలకు, కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి 50 వేల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు నిధులు నిర్ధేశించారు. ఈ స్కీమ్‌ కింద ఆతిధ్య రంగం, టూరిజం, ట్రావెల్‌, పౌర విమానయాన రంగాలకు రుణాలు ఇస్తారు. ఇందులో ఒక సంస్థకు 200 కోట్లుకు మించకుండా రుణాలు ఇస్తారు.

బ్యాంక్‌లకు నిధుల లభ్యతపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ బ్యాంక్‌లు నికర లాభాలను ఆర్థించాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం నికర లాభం 66,539 కోట్లు. గత సంవత్సరం ఇది 31,820 కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 2015-16, 2019-20 సంవత్సరాల్లో నష్టాలను ఎదుర్కొన్నాయి. అత్యధికంగా 2017-18 సంవత్సరంలో బ్యాంక్‌లు 85,370 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. 2018-19లో 66,636 కోట్లు, 2019-20లో 25,941 కోట్లు నష్టాలు వచ్చాయి. 2015-16లో 17,993 కోట్లు, 2016-17లో 11,389 కోట్ల నష్టాలను బ్యాంక్‌లు ఎదుర్కొన్నాయి. బ్యాంక్‌ల నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం 4ఆర్‌ఎస్‌ స్కీమ్‌ కింద 3,10,997 కోట్ల రూపాయల బ్యాంక్‌లకు పెట్టుబడిని అందించింది. ఇందులో 2016-17 నుంచి 2020-21 వరకు 34,997కోట్లు బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా సమకూర్చారు. ఎన్‌పీఏల తగ్గింపు, రుణాల రీకవర్‌ వంటి చర్యలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నియంత్రకు బ్యాంక్‌లు అనుసరించాల్సిన విధానాలపై కూడా సమావేశంలో చర్చకు వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement