Friday, November 8, 2024

మీటూపై సాయిప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

మీటూ ఉద్య‌మంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది హీరోయిన్ సాయిప‌ల్ల‌వి.. సింగర్, కంపోజర్ స్మిత సోనీలివ్ వేదికగా నిజం విత్ స్మిత్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి రెండు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గెస్టుగా వచ్చింది. ఈ క్రమంలో స్మిత సాయిపల్లవిని మీటూ ఉద్యమం గురించి ప్రశ్నించగా ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చేతలతోనే కాదు మాటలతో ఎదుటివ్యక్తికి ఇబ్బంది కలిగించేలా చేసినా అది వేధింపులతో సమానమే అంటూ సాయిపల్లవి మీటూ ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టాక్‌ షోలో పాల్గొని.. తన కెరీర్‌, తగిలిన ఎదురుదెబ్బలు ఇలా ఎన్నో విషయాలను పంచుకుంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుదలైంది. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌.. ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్‌ చేయాలని అనుకుంటున్నావు అని స్మిత ప్రశ్నించగా.. ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుంది అంటూ సాయిపల్లవి నవ్వుతూ బదులిచ్చింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement