Thursday, October 10, 2024

జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష ఉంటుందా.. !

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న దీక్షపై ఉత్కంఠ నెలకొంది. రేపు దీక్ష అనగా ఢిల్లీ పోలీసులు కొన్ని షరతులు విధించింది. అదేరోజు బిజెపి కూడా వేరే కార్యక్రమాన్ని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తుండటంతో కవితకు ఇదే విషయాన్ని పోలీసులు చెప్పారు.. వేదికను పంచుకోవలసి ఉంటుందని, అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్యను కుదించుకోవాలని కోరారు… వీలుంటే మరో ప్రాంతం చూసుకోవాలని ఢిల్లీ పోలీసులు సూచించిన‌ట్లు స‌మాచారం. దీంతో రేపు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద క‌విత దీక్ష ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement