Friday, December 6, 2024

రూ.3ల‌క్ష‌ల కోట్ల‌తో రాష్ట్ర బ‌డ్జెట్ కు ప‌దును..

అమరావతి : ఆంధ్రప్రభ : రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సమీపస్తున్న నేపథ్యంలో వార్షిక బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దేందుకు ఆర్థిక శాఖాధికారుల కసరత్తు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్స రానికి సంబంధించిన బడ్జెట్‌కు ఇప్పటికే మెరుగులు దిద్దగా, దానికి తుది రూపునిచ్చేం దుకు ముఖ్యమంత్రి వద్దకు బడ్జెట్‌ ఫైలు పంపించేందుకు కూడా ఆర్థికశాఖ అధికారులు చర్యలు తీసుకుంటు-న్నారు. స్వల్పంగా మార్పులు, చేర్పులకు కూడా ముఖ్యమంత్రి సూచనలు చేసే అవకాశా లున్నాయని అధికారులు అంటు-న్నారు. మొత్తమ్మీద ఈసారి బడ్జెట్‌ రూ. 3 లక్షల కోట్లకు చేరువలో వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధించిన బడ్జెట్‌ ను ప్రాథమికంగా సిద్ధంచేసి ముఖ్యమంత్రి పేషీకి అందించినట్లు- తెలిసింది. అక్కడ దీనిని అధ్యయనం చేసి తుది బడ్జెట్‌ అంకెల కోసం ముఖ్యమంత్రికి సమర్పిస్తారని సమాచా రం.

రెవెన్యూ వ్యయమే కీలకంగా ఉంటు-న్న ఈ బడ్జెట్‌లో గతం కన్నా ఎక్కువగానే సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తున్నట్లు- తెలిసింది. గతేడాది మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఒక్క రెవెన్యూ వ్యయానికే రూ.2.08 లక్షల కోట్ల వరకు కేటాయింపులు చేశారు. అదే వచ్చే బడ్జెట్‌లో రూ.2.38 లక్షల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ కేటాయింపులపైనే ముఖ్యమంత్రి మరోసారి అధికారులతో చర్చించి తుది అంకెలను ఖరారు చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల సంఖ్యపై కోతలు పడుతున్నట్లు- వస్తున్న విమర్శలపైనా ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి కార్యాలయాలు దృష్టి సారిస్తున్నట్లు- తెలిసింది. ఎన్నికల బడ్జెట్‌ కావడంతో ప్రజల నుంచి విమర్శలు పెరగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులకు సూచనలు వెళ్లినట్లు- తెలిసింది. లబ్ధిదారుల సంఖ్య, వారికి కేటాయించే నిధుల్లో భారీగా అంతరం లేకుండా బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దాలని కూడా సూచనలు వెళ్లినట్లు- తెలిసింది. మొత్తం ప్రక్రియను 15వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement