Thursday, May 16, 2024

ఏపీలో పర్యావరణ చట్టం ఉల్లంఘిస్తున్నారు: ఎన్జీటీ

ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటు అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. పర్యవరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది. పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కూడా చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీసీబీ నివేదికలో కేసు ముగించాలన్న ఆత్రుత మాత్రమే కనిపించిందని తప్పుబట్టింది.

చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి లోపించిందన్న ఎన్జీటీ ధర్మాసనం.. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాలు చేపడితే ఎలా అని ఘాటుగా ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ అంచనాను తూతూ మంత్రంగా చేశారని తప్పుబట్టింది.

ఈ వార్త కూడా చదవండి: ఇకపై ఆనందయ్య మందు ఉచితం కాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement