Thursday, April 25, 2024

ఇకపై ఆనందయ్య మందు ఉచితం కాదు

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కరోనాను నయం చేసే మందు అంటూ వెలుగులోకి వచ్చిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. కరోనా మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం తనకు సహకరించట్లేదని, తనను నిర్భంధించేందుకు ప్రయత్నించిందని, ఆ తర్వాత కోర్టు అనుమతి తెచ్చుకున్నాక మందు పంపిణీ ప్రారంభించానని ఆనందయ్య తెలిపారు.

అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉచితంగా మందు ఇస్తున్నందున ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని, అందువల్ల ఇకపై కరోనా మందు ఉచితంగా ఉండే అవకాశం లేకపోవచ్చని ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వ సహకారం ఉంటే మందును ఉచితంగా ఇవ్వొచ్చని, కానీ సాయం అందకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆనందయ్య స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: ఈనెల 16 నుంచి ఏపీలో ఇంటర్ కాలేజీలు ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement