Wednesday, May 8, 2024

న్యూజిలాండ్ రెండో టెస్టు.. 45ఓవర్లలో 157/5

న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండోరోజు ఆట ముగిసేసరికి కివీస్‌ 5వికెట్లకు 157పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో సారెల్‌ 108పరుగులుతో సెంచరీ చేయడంతో 364పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్‌ ఎల్గర్‌ 41పరుగులు, మార్క్‌రమ్‌ 42పరుగులుతో తమ వంతు సహకరించారు. దీంతో సఫారీజట్టు 133ఓవర్లలో 364పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ఆదిలోనే షాక్‌ ఇచ్చాడు. న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ జోడీ కెప్టెన్‌ టామ్‌లాథమ్‌(0)ను డకౌట్‌ చేశాడు. అనంతరం మరో ఓపెనర్‌ విల్‌యంగ్‌ (3)ను కూడా రబాడా పెవిలియన్‌కు పంపడంతో 9పరుగులుకే ఓపెనర్లు వికెట్లును న్యూజిలాండ్‌ కోల్పోయింది.

జట్టును ఆదుకుంటాడని భావించిన డేవాన్‌ కాన్వే(16)ను మార్కో జాన్సన్‌ పెవిలియన్‌కు పంపడంతో 51పరుగులు వద్ద కివీస్‌ మూడో కీలక వికెట్‌ కోల్పోయింది. వికెట్‌కీపర్‌ టామ్‌బ్లండెల్‌ (6) వికెట్‌ కూడా రబాడ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి డారిల్‌ మిచెల్‌ 78బంతుల్లో 4ఫోర్లుతో 29పరుగులు, గ్రాండ్‌హోమ్‌ 61పరుగులుతో 7ఫోర్లు, 2సిక్సర్లతో 54పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో క్రీజులో ఉన్నారు. మొత్తంమీద 45ఓవర్లలో న్యూజిలాండ్‌ 5వికెట్లు నష్టానికి 157పరుగులు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement