Saturday, May 4, 2024

టీమ్ ఇండియా గుడ్ ఎఫర్ట్.. రోహిత్ మ‌రో రికార్డ్..

భారత క్రికెట్ జ‌ట్టు గత కొన్ని వారాలుగా అద్భుత ప్రదర్శన చేస్తూ.. వ‌రుస‌ విజయాలను సాధిస్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఫిబ్రవరి నెలలో జరిగిన వన్డే సిరీస్‌లలో వెస్టిండీస్‌ను సులభంగా ఓడించింది. ఆ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్ లో రెండు విజయాల‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమ్ ఇండియా గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే మెరుగైన క్యాచర్‌గా రికార్డ్ సృంష్టిచాడు. జస్ప్రీత్ బుమ్రా బంతికి పాతుమ్ నిశాంకను సులువుగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో అతని అంతర్జాతీయ టీ20లో 50 క్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ ఫార్మాట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి భారతీయుడు, ప్రపంచంలో నాలుగో ఫీల్డర్‌గా నిలిచాడు. 44 క్యాచ్‌లు పట్టిన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement