Saturday, May 4, 2024

మేం పెళ్లి చేసుకోబోతున్నాం.. వీడియో రిలీజ్ చేసిన నరేష్.. ప‌విత్రా లోకేష్

కొత్త సంవ‌త్స‌రం..కొత్త ప్ర‌యాణం అంటూ న‌టులు ప‌విత్ర లోకేష్..సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ త‌మ పెళ్లిపై క్లారిటీ ఇవ్వ‌డం విశేషం. త్వరలోనే తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నటుడు నరేష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తమ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కట్​ చేస్తూ… త్వరలోనే పవిత్రను తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించాడు. కొన్ని రోజుల నుంచి వీరిద్దరు కలిసి ఉండటం చిత్ర పరిశ్రమలోనూ, సామాజిక మాద్యమాల్లోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నరేష రెండో భార్య రమ్య కూడా వీరి బంధంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు పవిత్ర నరేష్ యాష్ ట్యాగ్ పేరుతో వీడియో విడుదల చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో వీరిద్ద‌రు ఒకరినొక‌రు ముద్దుపెట్టుకోవ‌టం హైలెట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement