Sunday, May 5, 2024

మార్కెట్లో మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. పోకో ఎఫ్‌5 5జీ స్పెషాలిటీస్ ఇవే..

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ మానుఫాక్చ‌రింగ్ కంపెనీ Poco.. త‌మ బ్రాండ్ నుంచి దేశంలో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. Poco F5 5G పేరుతో వ‌చ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కావాలనుకునే వారు ఆన్‌లైన్ ప‌ర్చేసింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ ఫోనులో చాలా ప్రత్యేక ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాదు ప్రారంభంలోనే ఫోన్ తీసుకునే వారికి భారీ డిస్కౌంట్లను సైతం ప్రకటించారు. కొన్ని బ్యాంకు కార్డుల వారికి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచారు. మ‌రి Poco F5 5G స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు, ఆఫ‌ర్లు, ధర వివ‌రాలేంటో తెలుసుకుందాం…

Poco F5 5G ఫీచ‌ర్స్..

- Advertisement -

Poco F5 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999.
12GB RAM, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999.
ఈ స్మార్ట్‌ఫోన్ కార్బన్ బ్లాక్, స్నో స్టార్మ్ వైట్, ఎలక్ట్రిక్ బ్లూ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
120Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల Xinfinity Pro AMOLED డిస్ ప్లే.
64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా.
5000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ.


67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (45 నిమిషాలలోపే జిరో నుంచి 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ అవుతుంది).
డ్యుయల్ స్టీరియో సెటప్‌తో డాల్బీ అట్మోస్ సపోర్ట్, హై-రెస్ ఆడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది.
Qualcomm Snapdragon 7+ Gen2 ప్రాసెసర్‌.
ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంది. దీని ద్వారా ర్యామ్‌ని 19GB వరకు పెంచుకోవచ్చు.
ICICI, HDFC, SBI, Axis క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.3 వేల వరకు తగ్గింపు లభించనుంది.
ఈ రెండు వేరియంట్లను ఇప్పుడు వరుసగా రూ.26,999, రూ.30,999కే ఆర్డర్ చేయొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement