Saturday, April 27, 2024

1న సచివాలయ ఉద్యోగులకు కొత్త వేతనాలు : జానీ పాషా

అమరావతి, ఆంధ్రప్రభ : ఆగస్టు 1వ తేదీ నుండి పెరిగిన జీతాలు అందునుండటం తమకెంతో ఆనందంగా ఉందని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎండీ జాని పాషా చెప్పారు. ఈమేరకు ఆదివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూతన వ్యవస్థను సృష్టించి లక్షా ముప్ఫయి నాలుగు వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఇంత మందికి మంచి జరగడం సహించని కొంతమంది ఈఉద్యోగాలు శాశ్వతం కాదని, కేవలం తాత్కాలికమేనని, రూ. 15 వేలకు మించి జీతం పెరగదని ఉద్యోగులను కించపరిచే విధంగా అనేక అవాస్తవాలను ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

జనవరి నెలలో సచివాలయ ఉద్యోగులపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చి, తాము అండగా ఉన్నామంటూ కపట ప్రేమ నటించి ఉద్యోగులను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్దిపొందాలని విఫలయత్నం చేశారన్నారు. కానీ, మనసున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూగబోయాయన్నారు. ఈ శుభవార్త కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచిందన్నారు. కోటి ఆశలతో కొత్త జీతం కోసం ఎదురు చుసిన సచివాలయ ఉద్యోగులు ఆగస్టు 1తేదీన నూతన వేతనం అందుకోబోతున్నారని తెలిపారు. ఈశుభ సందర్బంలో ఉద్యోగులంతా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రికి సెల్యూట్‌ చేస్తూ కృతజ్ఞత చాటు-తున్నారని జాని పాషా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement