Saturday, May 4, 2024

రంగ‌రంగ‌ వైభ‌వంగా కొత్త రిలీజ్ డేట్-పోస్ట‌ర్ విడుద‌ల‌

హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం రంగ రంగ వైభ‌వంగా..ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మ న‌టిస్తోంది. గిరీశయ్య దర్శకత్వంలో రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ కేతిక రిజల్ట్ తో సంబంధం లేకుండా యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె ఊపందుకునే అవకాశముంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా శాందత్ సాయినుద్దీన్, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement