Saturday, May 4, 2024

అమ్మ బాబోయ్….వైసీపీ కార్పోరేటర్ కు జగన్ గుర్తులేడా ?

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు క్లీన్ స్వీప్ చేసింది. ఇక వైసిపి గెలుపుతో కార్యకర్తలు ,నాయకులు సంబరాలతో అదరగొట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు మాత్రం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఒకరికి ప్రమాణం చేయడానికి నోరు తిరగట్లేదు. మరొకరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటూ మాట్లాడేస్తున్నారు. ఈ వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ గారు…వీళ్లా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది అంటూ నెటిజన్లుమండిపడుతున్నారు. మేం గెలిచాం మేము గెలిచాము అంటూ చెబుతున్నారు గాని చదువుకుని ఉద్యోగాలు రాని ఎంతో మంది యువత ఇప్పటికీ ఖాళీ ఏదో పనులు చేసుకుంటున్నారు. అటువంటి వారికి మీరు ఈ అవకాశాలు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement