Saturday, April 27, 2024

5న నర్తకీమణులకు నాట్యప్రభ అవార్డుల ప్రదానోత్సవం

వివేక్‌నగర్‌, ప్రభన్యూస్ : వై.ఎస్‌.ఆర్‌. మూర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌, వైజ్‌ మెన్‌ క్లబ్‌ అఫ్‌ సికింద్రాబాద్‌ సెంట్రల్‌, శ్రీ త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో మే 5వ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటలకు త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదకలో అంతర్జాతీయ నృత్యోత్సవ సందర్భంగా పలువురు నర్తకీ మణులకు ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లతో పాటుగా నృత్యరంగంలో మంచి పేరు గడించిన నర్తకీమణులకు నాట్య ప్రభ అవార్డులతో సత్కరించనున్నట్లు ట్రస్టు రధసారధి వైఎస్‌ఆర్‌.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి ఆర్ట్‌ అకాడెమిలో శిక్షణ పొంది, కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ నర్తకిమణి నృత్య శిరోమణి బిరుదాంకితులు రేఖ సతీష్‌ (ఎం.ఏ.కూచిపూడి) తమ నృత్య ప్రదర్శనతో అలరింప చేయనున్నారనీ, హైదరాబాదుకు చెందిన సుప్రసిద్ధ నర్తకిమణి కూచిపూడి నృత్యంహలో ఎం.ఏ పట్టభద్రురాలు నాట్య రత్న రమణి సిద్ధి, డాక్టర్‌ వెంపటి చిన్న సత్యనారాయణ శిష్యరాలు 30 సంవత్సరాల అనుభవంతో తనదైన ప్రత్యేక శైలిలో నృత్యాన్ని కనువిందు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.

కూచిపూడి నృత్యంలో ఎం.ఏ పట్టభద్రురాలు సుప్రసిద్ధ నృత్య రారాణి రేణుక ప్రభాకర్‌ శిష్యురాలు సాయి లహరి సాంప్రదాయ రీతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుందని మూర్తి వివరించారు. ఈ సందర్భంగా జరుగనున్న సభా కార్యక్రమానికి సుప్రసిద్ధ కూచిపూడి నాట్యచార్యులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భాగవతుల సేతురాం ముఖ్య అతిధిగా నాట్య ప్రవీణ పి.రామదేవి నర్తకీమణులకు నాట్య ప్రభ బిరుదులను అందజేస్తారని ప్రముఖ నర్తకీమణి పద్మా కళ్యాణ్‌ ఆత్మీయ అతిధిగా, గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి తదితరులు సభలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి తాను అధ్యక్షత వహించనున్నట్లు వై ఎస్‌ ఆర్‌ మూర్తి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement