Thursday, May 2, 2024

అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ కి – ఎమ్మెల్సీ క‌విత‌కి ఆహ్వానం

ఎమ్మెల్సీ క‌విత‌ని ఆహ్వానించారు అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ ప్ర‌తినిధులు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే ఆటా 17వ మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది మహాసభలో పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ఈ సారి తెలంగాణ రాష్ట్ర పెవిలియన్‌ని ఏర్పాటు చేయనున్నట్లు.. అందులో మన ఊరు -మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం, వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వారు ఎమ్మెల్సీ కవితకు వివరించారు. భవిష్యత్‌ తరాలకు మన బతుకమ్మ విశిష్టత గురించి తెలిపేందుకు బతుకమ్మ పై ఇంగ్లీష్‌లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement