Saturday, April 27, 2024

నాగశౌర్య ‘వరుడు కావలెను’ టీజర్ విడుదల

నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘వరుడు కావలెను’ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అక్టోబరులో థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement