Tuesday, May 7, 2024

స్వల్పంగా శాంతించిన మున్నేరు.. రవాణా పునరుద్ధరనకు ఏర్పాట్లు చేయండి.. మంత్రి పువ్వాడ

ఖమ్మం : ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ప్రమాద స్థాయి ఉన్న ప్రాంతాల్లో తప్ప క్షేమకరంగా ఉన్న దారులన్నీ పునరుద్ధరించాలని అదనపు డీసీపీ బోస్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. మున్నేరు వరద ఉదృతిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యవేక్షించారు. గురువారం అర్ధరాత్రి 12.30 నిమిషాల వరకు NDRF బృందంతో కలిసి ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం కాల్వొడ్డు వద్ద మంత్రి పువ్వాడ మున్నేరు పరిస్థితులను పరిశీలించి పరిస్థితులను వాకబు చేశారు. వాహనాల రాకపోకలు మూసివేసిన ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై రవాణా అనుమతించాలని చెప్పారు. మున్నేరు ప్రస్తుతం 21.10 అడుగులు ఉందని బోస్ మంత్రికి వివరించారు. 19 అడుగులకు చేరిన అనంతరం కాల్వొడ్డు మున్నేరు పై వాహనాలు అనుమతించాలని సూచించారు.


పూర్తి స్థాయిలో మున్నేరు తగ్గుముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రభలకుండా అధికారులు అప్రమత్తతతో బ్లీచింగ్ చల్లి, మురుగు తొలగించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని పీ.హెచ్.సీల పరిధిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా ఉండాలన్నారు. మంత్రి వెంట డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement