Sunday, May 5, 2024

Argentina – బిలియ‌న‌ర్ ను ముక్క‌లు ముక్క‌లుగా నరికి హ‌త్య ..

బ్యూనస్ ఎయిర్స్ – అర్జెంటీనాలో బిలియ‌న‌ర్ ను దారుణంగా హ‌త్య చేశారు. క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లెయెన్సర్, బిలియనీర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా వారం రోజులుగా ఆయన కనిపించకుండా పోయారు. చివరకు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఒక కాలువ పక్కన విగత జీవిగా కనిపించాడు. ఒక సూట్ కేసులో ముక్కలుముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటుండగా వారికి రెడ్ కలర్ సూట్ కేస్ కనిపించింది. ఈ విషయాన్ని వారు వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

పోలీసులు సూట్ కేస్ ను తెలిచి చూడగా అందులో ఫెర్నాండో కాళ్లు, ఒక చేయి, కొన్ని భాగాలు కనిపించాయి. మరో చేయిని కాలువ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతని తల, ఇతర భాగాలను కూడా గుర్తించారు. శరీర భాగాలను అటాప్సీకి పంపించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికే ముందు మూడు సార్లు ఆయనను తుపాకీతో కాల్చారు. ఫింగర్ ప్రింట్స్, శరీరంపై ఉన్న టాటూల ఆధారంగా అధి ఫెర్నాండో డెడ్ బాడీ అని నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement